86.
అప్పా! యిచ్చితి వందురు
నప్పాలను నతిరసంబు
అనుభవ శాలీ
యప్పా! నను గనుగొనవే
యప్పా నను బ్రోవు
వేంకటప్పా! కృష్ణా
Tough
words: అప్పా= అయ్యా, తండ్రీ; అప్పాలను, నతిరసంబు = ఆ పాలను, మధుర పదార్థములను (నీ సఖులకు)
87.
కొంచపు వాడని
మదిలో
నెంచకుమీ వాసుదేవ
! గోవింద హరీ !
అంచితముగ నీ
కరుణకు
కొంచము నధికంబు
గలదె? కొలవిడ కృష్ణా
Tough
words: అంచితముగ = తగినట్లు చూడగా ; కొలవిడ = కొలవగా
88.
వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గు
చేయు గర్వాంధులకున్
దేవ! వధించుట
వింటిని
నీవల్లను భాగ్య
మయ్యె, నిజముగ కృష్ణా
Tough
words: వావిరి= వరుసగా, అనేకమార్లు; ఎగ్గు = కీడు
89.
అయ్యో పంచేంద్రియములు
నుయ్యాలల నూపినట్టు లూపగ నేనున్
చయ్యన గలగుచు
నుంటిని
కుయ్యాలింపుము
మహాత్మ! గోపతి కృష్ణా
Tough
words: చయ్యన = వెంటనే ; కలగుచు నుంటిని = కలత పడుచుంటిని; కుయ్య + ఆలింపుము = మొర వినుము
90.
కంటికి రెప్ప
విధంబున
బంటుగదా యనుచు
నన్ను బాయక నెపుడున్
జంటను నీవుండుటచే
కంటకమగు పాపములను
గడచితి కృష్ణా
No comments:
Post a Comment