81.
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతము
లెల్ల పంకజ నాభా!
బాపుము సాకుము
దయతో
శ్రీపతి! నిను
నమ్మినాడ సిద్ధము కృష్ణా
Tough
words: సిద్ధము= నిజము
82.
నీ నామము భవహరమగు
నీ నామము సర్వ
సౌఖ్య నివహ కరంబున్
నీ నామమమృత పూర్ణము
నీ నామము నే
దలంతు నిత్యుడ! కృష్ణా
Tough
words: నివహ కరము = తెచ్చునది, కలిగించునది
83.
పరులను నడిగిన
జనులకు
కురుచ సుమీ,
యిది యటంచు తెలిసియు నీవున్
కురుచడ వై యడిగితి
మును
ధర పాదత్రయము
బలిని తద్దయు కృష్ణా
Tough
words: కురుచ సుమీ, యిది యటంచు = అట్లడుగుట
పరువు తక్కువని ; కురుచడు= వామనుడు
84.
పాలును వెన్నయు
మ్రుచ్చిల
రోలను మీ తల్లి
గట్ట రోషము తోడన్
లీలావినోది వైతివి
బాలుడవా? బ్రహ్మ
గన్న ప్రభుడవు కృష్ణా
85.
రఘునాయక! నీ నామము
లఘుమతితో తలపగానె,
లక్ష్మీ రమణా
అఘములు బాపుము
దయతో
రఘురాముడ! సకలలోక
రక్షక కృష్ణా
Tough
words: లఘుమతితో = స్వల్ప బుద్ధితో నైనను; అఘములు = పాపములు
No comments:
Post a Comment