91.
యమునికి నిక
నే వెరువను
కమలాక్ష జగన్నివాస!
కామిత ఫలదా
విమలమగు నీదు
నామము
నమరగ దలచెదను
వేగ ననిశము కృష్ణా
Tough
words: అమరగ= ఒప్పుగా, చక్కగా
అనిశము= ఎల్లప్పుడు
92.
దండమయా విశ్వంభర!
దండమయా పుండరీక
దళ నేత్ర హరీ
దండమయా కరుణా
నిధి
దండమయా నీకు
నెపుడు దండము కృష్ణా
Tough
words: విశ్వంభర = లోకములను భరించిన వాడా
!
93.
నారాయణ లక్ష్మీపతి!
నారాయణ వాసుదేవ! నంద కుమారా
నారాయణ నిను
నమ్మితి
నారాయణ నన్ను
బ్రోవు నగధర! కృష్ణా
94.
తిరుమణి దురిత
విదూరము
తిరుమణి సౌభాగ్యకరము
త్రిజగంబందున్
తిరుమణి బెట్టిన
మనుజుడు
పరమ పవిత్రుండు
భాగ్య వంతుడు కృష్ణా
Tough
words: తిరుమణి = శ్రీ చూర్ణము, కస్తూరి తిలకము
95.
శ్రీలక్ష్మీ
నారాయణ
వాలాయము నిన్ను
దలతు వందిత చరణా
ఏలుము నను నీ
బంటుగ
చాలగ నిను నమ్మినాను
సరసుడ కృష్ణా
Tough
words: వాలాయము = తప్పక ; నిరంతరము; చాలగ = మిక్కిలిగా
No comments:
Post a Comment