76.
ఓ పుండరీక లోచన
ఓ పురుషోత్తమ! ముకుంద,
ఓ గోవిందా!
ఓ పురధ్వంసక
మిత్రుడ!
ఓ పుణ్యుడ నన్ను
బ్రోవుమో హరి కృష్ణా
Tough
words: పురధ్వంసక మిత్రుడు = త్రిపురాసురులను
సంహరించిన
శివునికి మిత్రుడు
77.
ఏ విభుడు ఘోర
రణమున
రావణు వధియించి
లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు-
నావిభు, నే మదిని
దలతు నచ్యుత కృష్ణా
78.
గ్రహ భయ దోషము
పొందరు
బహు పీడలు చేర
వెరచు పోవును నఘముల్
ఇహపర ఫలదాయక!
విను
తహతహ లెక్కడివి
నిన్ను దలచిన కృష్ణా
Tough
words: అఘములు= పాపములు ; తహతహలు= కోరికలు
79.
గంగ మొదలైన నదులను
మంగళముగ జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన
ఫలములు
రంగుగ మిము దలప, సాటి రావుర! కృష్ణా
Tough
words: మంగళముగ జేయునట్టి మజ్జనములకున్ =చేసే మంగళ స్నానములకు;
సంగతి గలిగిన ఫలములు= సత్సంగ ఫలములు;
సంగతి గలిగిన ఫలములు= సత్సంగ ఫలములు;
రంగుగ మిము దలప = చక్కగా నిన్ను తలచిన ఫలముతో
80.
ఆ దండకా వనంబున
కోదండము దాల్చినట్టి
కోమల మూర్తీ!
నాదండ గాగ రమ్మీ
వేదండము గాచినట్టి
వేల్పువు కృష్ణా
Tough
words: నాదండ గాగ రమ్మీ= నా యొక్క అండ యగుటకు
రమ్ము!
వేదండము = ఏనుగు