56.
పురుషోత్తమ!
లక్ష్మీపతి!
సరసిజ గర్భాది
మౌని సన్నుత చరితా
మురభంజన! సురరంజన!
వరదుడవగు, నాకు
భక్త వత్సల కృష్ణా
Tough
words: సరసిజ గర్భాది = బ్రహ్మ, ఇత్యాది ;
వరదుడవగు= వరము లిచ్చే వాడవు కమ్ము
57.
క్రతువులు తీర్థాగమములు
వ్రతములు దానములు
జేయ వలెనా? లక్ష్మీ-
పతి! మిము దలచిన
వారికి
నతులిత పుణ్యములు
గలుగుటరుదా? కృష్ణా
58.
స్తంభమున వెడలి
దానవ
డింభకు రక్షించినట్టి
రీతిని నన్నున్
కుంభీంద్ర వరద
కేశవ !
రంభాధిప వినుత! గావు రక్షక కృష్ణా
Tough
words: కుంభీంద్రుడు = గజేంద్రుడు ;
రంభాధిప వినుత = దేవేంద్రునిచే పొగడబడిన వాడా
59.
శతకోటి భానుతేజా
అతులిత సద్గుణ
గుణాఢ్య! యంబుజనాభా
రతినాధ జనక!
లక్ష్మీ
పతి! హిత! నను
గావు భక్త వత్సల కృష్ణా
Tough
words: రతినాధ జనక = మన్మథుని తండ్రి ( రతినాధుడు=
మన్మథుడు )
హిత= మంచి చేయువాడు
60.
మందుడ, నే దురితాత్ముడ
నిందల కొడిగట్టి
నట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర
నిన్ను నమ్మితి కృష్ణా
Tough words:
మందుడ= తెలివి హీనుడను
No comments:
Post a Comment