26.
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు
మ్రోవ, నాహవ భూమిన్
విభ్రములగు రాక్షస
జన
గర్భంబులు పగులజేయు
ఘనుడవు కృష్ణా
Tough
words: అభ్రంకషమగుచు= ఆకాశమును తాకునట్టి (శబ్దము) చేయుచు;
ఆహవ భూమి= యుద్ధ
భూమి; విభ్రములగు= భయపడినట్టి
27.
జయమును విజయున
కియ్యవె
హయముల ములుకోల
మోపి యదలించి మహా
రయమున నొప్పవె తేరున
భయమున రిపుసేన
విరిగి పారగ కృష్ణా
Tough
words: ములుకోల మోపి= కొరడాతో అదలించి; విరిగి పారగ= చెల్లా చెదురై పోవగా
28.
దుర్జనులగు నృపసంఘము
నిర్జించితి
పరశురాము నవతారమునన్
దుర్జనులను వధియింపను
నర్జును రథ చోదకుండ
వైతివి కృష్ణా
29.
శక్రసుతు గాచు
కొరకై
చక్రము చేపట్టి
భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని
పొగడను!
నక్రగ్రహ, సర్వలోక
నాయక కృష్ణా
Tough
words: శక్ర సుతుడు = ఇంద్ర పుత్రుడు, అర్జునుడు
నక్ర = మొసలి;
గ్రహ = నిర్మూలించిన వాడు
30.
దివిజేంద్ర సుతుని
జంపియు
రవిసుతు రక్షించినావు
రఘు రాముడవై
దివిజేంద్ర సుతుని
గాచియు
రవిసుతు బరిమార్చి
తౌర రణమున కృష్ణా
No comments:
Post a Comment