36.
అగణిత వైభవ!
కేశవ!
నగధర! వనమాలి!
యాది నారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు
నీకు శరణము కృష్ణా
Tough
words: అగణిత= లెక్కింప రాని
37.
మగ మీనమవై జలనిధి
పగతుని సోమకుని
చంపి పద్మభవునకున్
నిగమములు తెచ్చి
యిచ్చితి
సుగుణాకర మమ్ము
గరుణ చూడుము కృష్ణా
Tough
words: పగతుని= శత్రువైన; నిగమములు= వేదములు
38.
అందరు సురలును
దనుజులు
పొందుగ క్షీరాబ్ధి
దరువ, పొలుపున నీవా-
నందముగ కూర్మ
రూపున
మందరగిరి ఎత్తి
తౌర మాధవ కృష్ణా
Tough
words: తరువన్ = చిలకగా ; పొలుపున = చక్కగా
39.
ఆది వరాహుండయి
నీ
వా దనుజు హిరణ్యనేత్రు,
హతుజేసి తగన్,
మోదమున సురలు
పొగడగ
మేదిని కిటి
ముట్టి కెత్తి, మెరసితి కృష్ణా
Tough
words: హిరణ్యనేత్రుడు = హిరణ్యాక్షుడు; మేదిని=
భూమిని ; కిటి ముట్టి కెత్తి = వరాహ రూపుడవైన
నీ మూతి కోరల పై నెత్తి; (కిటి= వరాహము)
40.
కెరలి యరచేత
కంబము
సరుదుగ చేయుటను
వెడలి, యసురేశ్వరునిన్
ఉరమును జీరి
వధించితి
నరహరి రూపావతార
నగధర కృష్ణా
Tough
words: కెరలి= విజృంభించి; సరుదుగ చేయుటను = గట్టిగా చరచగా
No comments:
Post a Comment