31.
దుర్భర బాణము
రాగా
గర్భములో నుండి
‘యభవ గావు!’ మటన్నన్
నిర్భర కృప రక్షించితి-
వర్భకు నభిమన్యు
సుతుని నచ్యుత కృష్ణా
32.
గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుడౌదు,
చుక్కలలోనన్
బరమాత్మ! చంద్రుడౌదువు
నరులందున నృపతి
వౌదు, నయమున కృష్ణా
33.
చుక్కల నెన్నగ
వచ్చును
గ్రక్కున భూరేణువులను
గణుతింప నగున్
జొక్కపు నీ గుణ
జాలము
నక్కజమగు లెక్కపెట్ట,
నజునకు కృష్ణా
Tough
words: చొక్కపు=అందమైన
అక్కజమగు= ఆశ్చర్యమగు;
అజునకు= బ్రహ్మకు
34.
కుక్షిని నఖిల
జగంబులు
నిక్షేపము జేసి
ప్రళయ నీరధి నడుమన్
రక్షక! వట పత్రముపై
దక్షత పవళించు
నట్టి, ధన్యుడ కృష్ణా
35.
విశ్వోత్పత్తికి
బ్రహ్మవు
విశ్వము రక్షింప
దలచి విష్ణుడవనగా
విశ్వము జెరుపను
హరుడవు
విశ్వాత్మక నీవె
యగుచు వెలయగ కృష్ణా
No comments:
Post a Comment