71.
ఎటువలె కరిమొర
వింటివి
ఎటువలె ప్రహ్లాదు
కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట! నిను నమ్మినాడ
గావుము కృష్ణా
Tough
words: కటకట! నిను నమ్మినాడ = అయ్యయ్యో ! నిన్నే
నమ్మినానే !
72.
తటతట లేటికి
జేసెదు
కటకట పరమాత్మ
నీవు ఘంటా కర్ణు న్
ఎటువలె నిపుణుని
జేసితి-
వటువలె రక్షింపు
మయ్య అచ్యుత కృష్ణా
Tough
words: తటతటలు = మోసములు, సయ్యాటలు; ఘంటాకర్ణున్ = ఘంటాకర్ణుడను పిశాచ రాజును
ఎటువలె నిపుణుని జేసితి= ఏవిధముగా మోక్షార్హుని చేసి మోక్ష మిచ్చితివో
ఎటువలె నిపుణుని జేసితి= ఏవిధముగా మోక్షార్హుని చేసి మోక్ష మిచ్చితివో
73.
తురగాధ్వరమును జేసిన
పురుషులకును
వేరు, యిలను పుట్టుట ఏమో
హరి మిము దలచిన
వారికి
యరుదా? కైవల్య
పదవి యచ్యుత కృష్ణా
తురగాధ్వరము
= అశ్వమేధ యాగము;
వేరు యిలను పుట్టుట
ఏమో = మరొకసారి భూమిపై జన్మించుట ఉండకపోవచ్చును
కైవల్య పదవి=
మోక్షము
74.
ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ!
మురారి యో రఘురామా!
ఓ భక్త కామధేనువ!
ఓ భవహర నన్నుగావు
యో హరి కృష్ణా
75.
ఏ తండ్రి, కనక
కశ్యపు
ఘాతకుడై యతని
సుతుని కరుణను గాచెన్
ప్రీతి సురకోటి
పొగడగ
నా తండ్రీ నిన్ను
నేను నమ్మితి కృష్ణా
Tough
words: ఏ తండ్రి = ఏ విష్ణువు;
కనక కశ్యపు ఘాతకుడై
= హిరణ్యకశిపుని చంపి ;
No comments:
Post a Comment