16.
పాణీ తలమున వెన్నయు
వేణీ మూలంబునందు
వెలయగ పింఛం-
బాణీ ముత్యము
ముక్కున
జాణవు నై దాల్చు
శేష శాయివి కృష్ణా
Tough
words: పాణీ తలము= అరచేయి; వేణీ మూలము= జుట్టు కొప్పు
17.
మడుగుకు జని
కాళీయుని
పడగలపై భరత శాస్త్ర
పధ్ధతి వెలయన్
కడు వేడుకతో
నాడెడు
నడుగులు నా మదిని
దలతు నచ్యుత కృష్ణా
18.
బృందావనమున బ్రహ్మా-
నందార్భక మూర్తి
వేణునాదము నీవా
మందార మూలమున
గో-
విందా పూరింతు
వౌర వేడుక కృష్ణా
19.
వారిజ నేత్రులు
యమునా
వారిని జలకంబులాడ
వచ్చిన నీవా
చీరలు మ్రుచ్చిలి
తెచ్చితి
నేరుపుగా యదియు
నీకు నీతియె కృష్ణా
Tough
words: యమునా వారిని= యమునా నది నీటిలో; మ్రుచ్చిలి= దొంగిలించి
20.
దేవేంద్రుడలుక
తోడను
వావిరిగా రాళ్ళ
వాన వడి గురియింపన్
గోవర్ధన గిరి
ఎత్తితి
గోవుల గోపకుల
గాచు కొరకై కృష్ణా
Tough
words: వావిరిగా= మిక్కిలిగా
No comments:
Post a Comment