21.
అండజ వాహన విను బ్ర -
హ్మాండంబులు
బంతులట్లు యాడెడు నీవా
కొండల నెత్తితి
వందురు
కొండిక పని గాక
దొడ్డ కొండా కృష్ణా
Tough
words: అండజము =పక్షి, గరుత్మంతుడు; కొండిక = తుంటరి
22.
అంసాలంబిత కుండల
కంసాంతక నీవు
ద్వారకా పురి లోనన్
సంసారి రీతి
నుండి ప్ర-
శంసార్హుడ వైతి,
వహహ! జగతిని కృష్ణా
Tough
words: అంసాలంబిత కుండలములు = భుజముల వరకు వ్రేలాడు చెవి పోగులు
23.
పదియారువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు
నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహు
రూపుల
వదలక భోగింతు
వౌర వసుధను కృష్ణా
Tough
words= బహు రూపుల వదలక భోగింతువు = అందరి వద్ద అన్ని రూపులలో నుండి సుఖము నిచ్చెదవు
24.
అంగన పనుపున
ధోవతి
కొంగున నటుకులను
ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయ
నొసగితి
రంగుగ సంపదలు
లోక రక్షక కృష్ణా
Tough
words: అంగన పనుపున = భార్య పంపగా ( కుచేలుడు )
25.
హా! వసుదేవ కుమారక!
కావుము నా మానమనుచు
కామిని వేడన్
నా వనజాక్షికి
నిచ్చితి
శ్రీవర! యక్షయ
మటంచు చీరలు కృష్ణా
No comments:
Post a Comment