Monday, August 20, 2012

Krishna Satakamu - కృష్ణ శతకము - Poems 6-10


6.
చిలుక నొక  రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ! యనుచు శ్రీపతి పేరన్
పిలచిన మోక్షము నిచ్చితి-
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా
Tough words: అలరగ = సంతోషముతో
7.
అక్రూర వరద, మాధవ!
చక్రాయుధ, ఖడ్గపాణి,  శార్oగ, ముకుందా
శక్రాది దివిజ సన్నుత!
శుక్రారీ!  నన్ను కరుణ జూడుము కృష్ణా

Tough words: శార్oగము = విష్ణు మూర్తి ధరించు ధనుస్సు; శక్రాది= ఇంద్రాది;
శుక్రారి = శుక్రుని దండించిన వాడు.
వామనావతారమున  బలిచక్రవర్తి వామనునికి మూడడుగులు దానమిచ్చు చుండగా శుక్రుడు కమండలము కాడకు కీటక రూపములో అడ్డుపడి, జలధార పడకుండా చేసెను. అప్పుడు వామనుడు దర్భ పుల్లతో కాడను కెలికెను. దర్భ గుచ్చుకొని శుక్రుని కన్ను పోయి అతడు బాధతో బయటకు వచ్చెను. అప్పుడు జలధార పడగా బలిచక్రవర్తి తన దాన క్రియను పూర్తిచేసెను.
8.
నందుని ముద్దుల పట్టిని,
మందరగిరి ధరుని, హరుని, మాధవు, విష్ణున్
సుందర రూపుని, మునిజన-
వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణా
9.
ఓ కారుణ్య పయోనిధి!
నాకాధారంబు వగుచు నయముగ బ్రోవన్
నాకేల యితర చింతలు ?
నాకాధిప వినుత! లోక నాయక! కృష్ణా
Tough words: నాకాధిప వినుత= స్వర్గాధిపతి ఇంద్రునిచే ప్రార్ధించ బడిన వాడు
10.
వేదంబులు గననేరని
యాది పర బ్రహ్మ మూర్తి – వనఘ! మురారీ
నా దిక్కు జూచి కావుము
నీ దిక్కే నమ్మి నాడ నిజముగా కృష్ణా

No comments: