51.
పంచేంద్రియ మార్గంబుల
గొంచెపు బుద్ధిని
జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన
సంగతి
నెంచుక మిమ్మెరిగినాడ
నిప్పుడె కృష్ణా
Tough
words: కొంచెపు బుద్ధిని = స్వల్ప బుద్ధితో
;
సజ్జన సంగతి
ఎంచుక = సజ్జన సాంగత్యము ఎన్నుకొని (చేసికొని)
52.
దుష్టుండ దురాచారుడ
దుష్ట చరిత్రుడను చాల దుర్బుద్ధిని నే
నిష్ఠ నిను గొల్వనేరను
ఇష్టముతో నన్ను గావు
నిలలో కృష్ణా
53.
కుంభీంద్ర వరద! కేశవ!
జంభాసుర వైరి, దివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర!
జలనిధి
గంభీరా నన్ను
గావు కరుణను కృష్ణా
Tough
words: కుంభీంద్ర వరద = గజేంద్రుని కాపాడిన
వాడా,
దివిజ సన్నుత
చరితా= దేవతలచే పొగడబడిన చరిత్రము గలవాడా
జలనిధి గంభీరా
= సముద్రము వంటి గాంభీర్యము గలవాడా
54.
దిక్కెవ్వరు
ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు
పాండవులకు, దీనుల కెపుడున్
దిక్కెవ్వర-
య్యహల్యకు
దిక్కెవ్వరు
నీవె నాకు దిక్కువు కృష్ణా
Tough
words: అ- య్యహల్యకు = ఆ + అహల్యకు
55.
హరి నీవె దిక్కు!
నా కన
సిరితో నేతెంచి
మకరి శిక్షించి తగన్
పరమేష్ఠి సురలు పొగడగ
కరి గాచిన రీతి
నన్ను గావుము కృష్ణా
Tough
words: నా కన = నాకు + అన ; మకరి = మొసలి
No comments:
Post a Comment