11.
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి
నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా
దేవకి
యుదరములో నెట్టు
లొదిగి యుంటివి కృష్ణా
12
అష్టమి రోహిణి
ప్రొద్దున
నష్టమ గర్భమున
బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు
వధింపవె,
సృష్టి ప్రతిపాలనంబు
సేయగ కృష్ణా
Tough
words= సృష్టి = ప్రపంచమును; ప్రతిపాలనంబు = చక్కని పాలన
13.
అల్ల జగన్నాధుకు
వ్రే -
పల్లియ క్రీడార్ధమయ్యె,
పరమాత్మునకున్
గొల్లసతి యా
యశోదయు
తల్లియునై చన్ను
గుడిపె, దనరగ కృష్ణా
14.
అందెలు గజ్జెలు
మ్రోయగ
చిందులు ద్రొక్కుచును
వేడ్క చెలువారంగా
నందుని సతి,
యా గోపిక
ముందర నాడుదువు,
మిగుల మురియుచు కృష్ణా
15.
హరి చందనంబు
మేనున
కర మొప్పెడు
హస్తములును, కంకణ రవముల్
ఉరమున రత్నము
మెరయగ
బరగితివౌ నీవు
బాల ప్రాయము కృష్ణా
Tough
words: కర మొప్పెడు= అందమైన;
ఉరమున= వక్ష స్థలమున ;
పరగితివి= ఒప్పితివి,
ఉంటివి
No comments:
Post a Comment