1.
శ్రీ రుక్మిణీశ
కేశవ ,
నారద సంగీత లోల,
నగధర శౌరీ
ద్వారక నిలయ
జనార్దన
కారుణ్యము తోడ
మమ్ము గావుము కృష్ణా !
Tough
words: నగధర= పర్వతమును ధరించినవాడు
2.
నీవే తల్లివి
దండ్రివి,
నీవే నా తోడు
నీడ , నీవే సఖుడౌ
నీవే గురుడవు
దైవము
నీవే నా పతియు
గతియు నిజముగా కృష్ణా
3.
నారాయణ పరమేశ్వర
ధారాధర నీల దేహ
, దానవ వైరీ
క్షీరాబ్ధి శయన
యదుకుల
వీరా నను గావు
కరుణ, వెలయగ కృష్ణా
Tough
words: ధారాధర =మేఘము (నీటిని ధరించునది)
4.
‘హరి’ యను రెండక్షరములు
హరియించును పాతకముల
నంబుజనాభా
హరి నీ నామ మహత్యము
హరి హరి పొగడంగ
వశమె, హరి శ్రీ కృష్ణా
5.
క్రూరాత్ము-
డజామీళుడు
నారాయణ యనుచు
నాత్మ నందను పిలువన్
నేరీతి నేలుకొంటివి
ఏరీ నీ సాటి
వేల్పు లెందును కృష్ణా
No comments:
Post a Comment