46.
వెలిపపు తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు
నిలుప, హీనుల ద్రుంపన్
కలియుగము తుదిని వేడుక
కలికివి గానున్న
లోక కర్తవు కృష్ణా
Tough
words: వెలిపపు = తెల్లని ; తేజీ = గుఱ్ఱము
47.
వనజాక్ష! భక్తవత్సల!
ఘనులగు త్రైమూర్తులందు
కరుణా నిధివై
కన, నీ సద్గుణ
జాలము
సనకాది మునీంద్రు
లెన్న జాలరు కృష్ణా
Tough
words: కన = చూడగా
48.
అపరాధ సహస్రంబుల
నపరిమితము లైన
యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై
జేసితి
చపలుని నను గావు
శేషశాయివి కృష్ణా
Tough
words: అఘములు = పాపములు; అనిశము= ఎల్లప్పుడు
49.
నరపశుడ మూఢచిత్తుడ
దురితారంభుడను
మిగుల దోషగుడను నీ
గురుతెరుగ నెంత
వాడను
హరి నీవే ప్రాపు
దాపు వౌదువు కృష్ణా
Tough
words: నీ గురుతెరుగ = నిన్ను తెలుసుకొన; ప్రాపు దాపు= అండదండ
50.
పరనారీ ముఖపద్మము
గురుతుగా నొయ్యారి నడక గొప్పును నడుమున్
అరయంగనె
మోహింతురు
నిరతము నిను
భక్తీ గొల్వ నేర్వరు కృష్ణా
Tough
words: అరయంగనె= చూడగనే
No comments:
Post a Comment